: ముంపు గ్రామాలను మాత్రమే ఏపీలో కలపాలని నిర్ణయించాం: జైరాం రమేశ్


బాధితులకు న్యాయం చేసేందుకు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలపాల్సిన అవసరముందని జైరాం చెప్పారు. ముంపు ప్రభావాన్ని తగ్గించేందుకు రూ.600 కోట్లతో రక్షణ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని ఆయన చెప్పారు. ఇప్పుడు తెలంగాణ నుంచి బదిలీ అవుతున్న గ్రామాలు 1959 కి పూర్వం ఆంధ్రప్రదేశ్ లోనే ఉండేవని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భద్రాచలం పట్టణం, రామాలయం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాయన్నారు. ముంపు గ్రామాలను మాత్రమే ఖమ్మం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాకు బదలాయించాలని కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 12న నిర్ణయించిందని జైరాం పేర్కొన్నారు. పునరావాసానికి అవసరమైతే బిల్లులో సవరణలకు వెసులుబాటు కల్పిస్తామని ఆనాడు రాజ్యసభలో ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆర్డినెన్స్ ను తీసుకురాలేకపోయామన్నారు.

  • Loading...

More Telugu News