: పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు: జైరాం రమేశ్


పోలవరం ప్రాజెక్టు వల్ల బహుముఖ లాభాలున్నాయని రాజ్యసభలో మాజీ కేంద్ర మంత్రి జైరాంరమేశ్ చెప్పారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు అని ఆయన సభకు విన్నవించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే విశాఖ నగరానికి 23 టీఎంసీల త్రాగునీటిని అందించవచ్చునని అన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16 వేల కోట్లు కాగా, ఇప్పటికే 32 శాతం నిధులను ఖర్చుచేశారని జైరాం రమేశ్ తెలిపారు. 45 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుందని జైరాంరమేశ్ అన్నారు. ఆయన ప్రసంగానికి కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ అడ్డుతగిలారు. అయితే, స్పీకర్ ఆయన ప్రసంగం పూర్తయిన తర్వాత మాట్లాడాల్సిందిగా వీహెచ్ కు సూచించడంతో జైరాం రమేశ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

  • Loading...

More Telugu News