: రెండో టెస్టుకు వ్యూహం మార్చనున్న ఇంగ్లండ్... కెర్రిగన్ కు పిలుపు


ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు వ్యూహాన్ని మార్చనుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టు నలుగురు పేసర్లతో బరిలో దిగిన సంగతి తెలిసిందే. పార్ట్ టైమ్ స్పిన్నర్ గా మొయిన్ అలీ సేవలందించాడు. అయితే, తమ బౌలింగ్ దాడి భారత బ్యాటింగ్ లైనప్ పై ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం కెప్టెన్ కుక్ ను కలవరపరుస్తోంది. అందుకే, రెండో టెస్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ సైమన్ కెర్రిగన్ ను బరిలోకి దించాలని నిర్ణయించాడు. కెర్రిగన్ చేరికతో బౌలింగ్ దాడుల్లో వైవిధ్యం సాధ్యమవుతుందన్నది కుక్ యోచన. కెర్రిగన్ నెట్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని ఇంగ్లండ్ సారథి పేర్కొన్నాడు. లార్డ్స్ లో వాతావరణం వేడిగా, పొడిగా ఉండే పక్షంలో కెర్రిగన్ ను తుదిజట్టులోకి ఎంపిక చేస్తామని కుక్ వెల్లడించాడు. కాగా, రెండో టెస్టు లార్డ్స్ లో జూలై 17న ఆరంభమవుతుంది.

  • Loading...

More Telugu News