: ఎంసెట్ కౌన్సెలింగ్ పై స్పందించకుంటే కోర్టుకు వెళతాం: మంత్రి గంటా


విద్యాశాఖ మంత్రిగా గంటా శ్రీనివాసరావు తొలిసారి విశాఖ జిల్లా ఆనందపురం మండలం గురజాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, వసతుల లేమిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల రిజిస్టర్లు సరిగా నిర్వహించడంలేదని, పదిహేను రోజుల్లోగా అన్ని సమస్యలను పరిష్కరించాలని అక్కడి ఉపాధ్యాయులను మంత్రి ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంసెట్ కౌన్సెలింగ్ పై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News