: హఫీజ్ సయీద్ విషయంలో అనుచరుడికి బాబా రాందేవ్ మద్దతు


26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ను పాకిస్థాన్ లో తన అనుచరుడు వేద్ ప్రతాప్ వైదిక్ కలవడాన్ని యోగా గురువు బాబా రాందేవ్ సమర్థించారు. విలేఖరి హోదాలోనే ఆ తీవ్రవాదిని వైదిక్ కలిసి ఇంటర్వ్యూ చేశాడని వెనకేసుకొచ్చారు. అటు రాజ్యసభలో ఈ విషయంపై రగడ నెలకొనడంపై జర్నలిస్టు వైదిక్ స్పందిస్తూ, నలభై ఐదేళ్ల నుంచీ తాను దక్షిణ ఆసియాలోని పలువురు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులను కలుస్తున్నానన్నారు. ఓ రాయబారి హోదాలో తానెప్పుడూ ఎవరినీ కలవలేదనీ, అలాంటిది మోడీ రాయబారిగా ఎవరినైనా ఎందుకు కలుస్తానని స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈ వ్యవహారంపై కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నకు... మోడీ ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వాలన్నారు. హఫీజ్ సయీద్, వైదిక్ కలసినప్పుడు తీసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడంతో ఈ వివాదం రేగింది.

  • Loading...

More Telugu News