: అమెరికాలో ఈత కొలనులో పడి ఎన్నారై మహిళ మృతి
పుట్టిన రోజు వేడుకకు వెళ్లిన ఓ ప్రవాస భారతీయ మహిళ అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈత కొలనులో విగత జీవిగా బయటపడిన మృతురాలిని రాజకుమారి మోత్వానీ (55) గా పోలీసులు గుర్తించారు. ఈత కొలనులో పడి రాజకుమారి మృతి చెందిన వైనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాంగ్ ఐలాండ్ లో ఆదివారం ఓ ఇంటిలోని ఈత కొలనును శుభ్రం చేస్తుండగా, రాజకుమారి మృతదేహం బయటపడింది. ఆ ఇంటిలో అంతకుముందు రోజు బర్త్ డే పార్టీ జరిగిందని పోలీసులు చెప్పారు. రాజకుమారి మృతి వెనుక ఎలాంటి కుట్ర కోణం కనిపించడం లేదని కేసును దర్యాప్తు చేస్తున్న సల్ఫోక్క్ పోలీసులు తెలిపారు.