: జైలులోనే అఫ్జల్ మృతదేహం ఖననం


ముంబయి దాడుల కేసులో కసబ్ ను ఉరి తీయడం ఎంత గోప్యంగా జరిగిందో, అదే గోప్యతను పార్లమెంటు దాడి కేసులో దోషి అఫ్జల్ గురు విషయంలోను కేంద్ర హోంశాఖ పాటించింది. ఈ ఉదయం అఫ్జల్ ను ఉరితీసే ప్ర్ర్రక్రియను అత్యంత రహస్యంగా అధికారులు కానిచ్చేశారు.

రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించడం నుంచి, ఉరిశిక్ష అమలు చేయడం వరకు 
హోంశాఖ అన్ని విషయాలను గోప్యంగా వుంచి, పని పూర్తయిన పిదపే అసలు విషయాన్ని మీడియాకు వెల్లడించిందికాగా, అఫ్జల్ మృత దేహాన్ని జైల్లోనే ఉరి తీసిన ప్రదేశానికి దగ్గరలోని జైల్ నం 3 వద్ద అధికారుల ఆదేశాల మేరకు ఖననం చేసినట్లు సమాచారం. గతంలో కసబ్ మృతదేహాన్ని కూడా అలాగే జైలులోనే ఖననం చేశారు.

  • Loading...

More Telugu News