: రామగుండం ఎన్టీపీసీలో నిలిచిన విద్యుదుత్పత్తి


కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉన్న ఎన్టీపీసీ ఏడో యూనిట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్-2లో లీకేజీ కారణంగా ఏడో యూనిట్ లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీని కారణంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన సాంకేతిక నిపుణులు లోపాన్ని సరిదిద్దే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News