: నేడు హైదరాబాద్ రానున్న మైక్రోసాఫ్ట్ భారత ఛైర్మన్
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ భారత ఛైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ నేడు హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను విస్తరించాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రాథమిక చర్చలు జరిపేందుకు భాస్కర్ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్, సంబంధిత అధికారులతో సమావేశమవుతారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆగస్టులో హైదరాబాద్ రానున్నారని టీ ప్రభుత్వానికి సమాచారం అందింది.