: కాసేపట్లో జానారెడ్డితో టీ-ఉద్యోగ సంఘ నేతల సమావేశం
తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డితో తెలంగాణ ఉద్యోగ సంఘ నేతలు మరికాసేపట్లో సమావేశం కానున్నారు. రాజ్యసభలో పోలవరం ఆర్డినెన్స్ ను అడ్డుకునేందుకు సోనియాగాంధీపై ఒత్తిడి తేవాలని ఈ సమావేశంలో ఉద్యోగ సంఘ నేతలు కోరనున్నారని తెలిసింది. పోలవరం ఆర్డినెన్స్ ను అడ్డుకునేందుకు టీ-ఉద్యోగ నేతలు తలమునకలై ఉన్నారు.