: టీడీపీకి షాక్ ఇచ్చిన ఈదర హరిబాబు
ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివరి నిమిషంలో ఈదర హరిబాబు టీడీపీకి షాక్ ఇచ్చారు. ఈదర టీడీపీ రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగి జెడ్పీ ఛైర్మన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయనకు వైఎస్సార్సీపీ సభ్యులు మద్దతు పలకడంతో ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. పొన్నలూరు నుంచి టీడీపీ తరఫున ఈదర హరిబాబు ఎన్నికయ్యారు. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలో టీడీపీకి ఈదర ఓటు వేశారు.