: హువాయ్ నుంచి రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు
ఆండ్రాయిడ్ ఆధారిత రెండు స్మార్ట్ ఫోన్లను హువాయ్ అసెండ్ జి510, వై300 పేరుతో దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రెండూ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తాయి.అసెండ్ జి510లో 1.2 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ సిపియు, 1750 మిల్లీయాంపీ హవర్ల లిథియం పాలిమర్ బ్యాటరీ, 9.9 స్లిమ్ డిజైన్, 4.5 అంగుళాల ఎఫ్ డబ్ల్యూవిజిఎ డిస్ ప్లే, 5 మెగాపిక్సెల్స్ వెనక కెమరా, 0.3 మెగాపిక్సెల్స్ తో మందు కెమెరా అమర్చారు. వైఫై ద్వారా ఫైళ్లను నేరుగా ఒక మొబైల్ నుంచి మరొక మొబైల్ కు పంపుకోవచ్చు. బ్లూట్, డిఎల్ఎన్ఎ సదుపాయం కూడా ఉంది. దీని ధర రూ.10,990.
ఇక అసెండ్ వై300లో 1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 4 అంగుళాల డబ్ల్యూవిజిఎ ఎల్ సీడీ స్క్రీన్, 1730 మిల్లీయాంపీ అవర్ల బ్యాటరీ, వెనుక 5 మెగాపిక్సెల్స్ ఆటో ఫోకస్ కెమెరా, ముందు భాగంలో 0.3 మెగాపిక్సెల్స్ కమెరా, 512 ఎంబి ర్యామ్ ఉన్నాయి. దీని ధర రూ.7,980. ఆన్ లైన్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్, టాటా క్రోమ్, యూనివర్సల్, ఈ జోన్ ఇతర అవుట్ లెట్లలో ఈ ఫోన్లు లభిస్తాయి.