: ఉత్కంఠ రేపుతున్న ప్రకాశం జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక
ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈదర హరిబాబు నామినేషన్ వేశారు. ఈదర హరిబాబు అభ్యర్థిత్వాన్ని వైఎస్సార్సీపీ సభ్యులు బలపరిచారు. నామినేషన్ వేసిన ఈదరతో మంత్రి శిద్ధా, ఎమ్మెల్యే ఏలూరి చర్చలు జరుపుతున్నారు. జెడ్పీ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘంతో కలెక్టర్ మాట్లాడుతున్నారు. ఎన్నికను జరపాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఎన్నికల సంఘంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.