: ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న కేసీఆర్
సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. ఇవాళ సికింద్రాబాదులో మహంకాళీ జాతర సందర్భంగా ఆయన అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఆలయ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు. దర్శనానంతరం కేసీఆర్ మాట్లాడుతూ... అమ్మవారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ ప్రజలకు అమ్మవారి దయ ఎప్పుడూ ఉంటుందన్నారు. ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారికి ప్రార్థించినట్లు ఆయన చెప్పారు.