: తొలి ఇన్నింగ్స్ లో ఇగ్లండ్ దే ఆధిపత్యం
నాటింగ్ హామ్ లో ఇంగ్లండ్ లో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు భారత బౌలర్లు తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కనీసం వంద పరుగుల ఆధిక్యమైనా సాధిస్తుందని అందరూ భావించిన తరుణంలో... ఇంగ్లండే 39 పరుగుల లీడ్ సాధించింది. ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ రూట్-అండర్సన్ లు పదో వికెట్ కు ఏకంగా 198 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరి పోరాటంతో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 496 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. విజయ్ (52), ధావన్ (29), పుజారా (55) ఔట్ అయ్యారు. కోహ్లీ (8), రహానే (18) క్రీజులో ఉన్నారు.