: ఆగస్టు నెలాఖరుకు ఏపీ రాజధాని నిర్ణయిస్తాం: బాబు
అందరి ఉత్కంఠ వీడనుంది. రాజధాని ఇక్కడని కొందరు... కాదు కాదు అక్కడ అంటూ వెల్లువెత్తుతున్న ఊహాగానాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెరదించనున్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధాని ప్రాంతాన్ని సూచించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఆగస్టులో నివేదిక ఇస్తుందని, నివేదిక పరిశీలించిన తరువాత రాజధాని ఎక్కడనేది ప్రకటిస్తామని, ఈ ప్రక్రియ ఆగస్టు నెలాఖరుకల్లా పూర్తవుతుందని అన్నారు. ప్రస్తుతానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకే డబ్బులు లేవని, రైతు రుణమాఫీ భవిష్యత్ లో చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆదాయం వచ్చే ప్రాంతాన్ని తెలంగాణకు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.