: కార్మికులకు 1000 క్వార్టర్స్ నిర్మిస్తాం: సింగరేణి సీఎండీ
వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కొత్త గనులను ప్రారంభిస్తామని సింగరేణి సీఎండీ భట్టాచార్య చెప్పారు. కార్మికుల కోసం మంజూనగర్లో 1000 క్వార్టర్స్ ను నిర్మిస్తామని ఆయన తెలిపారు. భూపాలపల్లిలోని ఓపెన్ కాస్ట్ గనులను ఆయన ఇవాళ పరిశీలించారు. త్వరలో కేటీపీపీకి పూర్తి స్థాయిలో బొగ్గు అందిస్తామని ఆయన తెలిపారు.