: నడక దారి భక్తులకు... శ్రీవారి దర్శనం రేపే!
తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా కాలినడకన వచ్చే భక్తులను క్యూలైన్ లోకి అనుమతించడం లేదు. తమను క్యూలైన్లలోకి అనుమతించాలంటూ భక్తులు ఆందోళనకు దిగారు. అయితే, శ్రీవారి దర్శనం కోసం ఇప్పటికే క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు ఈ రాత్రికి శ్రీవారి దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. నడకదారి భక్తులను రేపు క్యూలైన్లలోకి అనుమతిస్తామని వారు వెల్లడించారు. ఇవాళ గురుపౌర్ణమి సందర్భంగా, అందునా శనివారం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో రేపు రాత్రి వరకు శ్రీవారి ఆలయంలో రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తిరుమలలో అద్దె గదులు దొరకక భక్తులు ఆరుబయటే సేదతీరుతున్నారు.