: భారత్ ది పాతకథే...రూట్, అండర్సన్ ల ప్రపంచ రికార్డు


నాటింగ్ హామ్ లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు పాతకథనే పునరావృతం చేసింది. ప్రపంచంలోని ఏ జట్టైనా పూర్తిగా విఫలమవుతున్నా, ఆ జట్టులోని ప్రధాన ఆటగాడు విఫలమవుతున్నా వాళ్ళు భారత జట్టుతో ఒక్కసారి తలబడితే, ఇక గాడిన పడిపోతారనే సెంటిమెంటును భారత జట్టు నిజం చేస్తోంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై పూర్తిగా విఫలమైన ఇంగ్లాండ్ జట్టు మనతో ఆడి తన ప్రతిభను మెరుగుపరచుకుంది. అదే సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు! మామూలుగా టాపార్డర్, మిడిలార్డర్ పని పట్టే భారత బౌలర్లు, ఇంగ్లాండ్ బౌలర్ల బ్యాటింగ్ నైపుణ్యాన్ని తిలకిస్తూ వుండిపోయారు. ప్రాక్టీస్ మ్యాచ్ లోలా పేలవమైన బంతులు విసిరి చివరి బ్యాట్స్ మన్ ప్రపంచ రికార్డు సాధించేందుకు యథాశక్తి సహాయం చేశారు. దీంతో జో రూట్ (143) తో కలిసి ఆండర్సన్ (81) 200పరుగుల పైచిలుకు భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో టీమిండియాపై ఇంగ్లాండ్ 23 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 457 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 485 పరుగులు సాధించింది.

  • Loading...

More Telugu News