: ఎస్సీ సబ్ ప్లాన్ కు నిధులు కేటాయించండి: కేంద్రానికి సీపీఎం వినతి
షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ కు దేశంలో ఎస్సీల నిష్పత్తి ప్రకారంగా నిధుల కేటాయించాలని సీపీఎం పార్టీ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కె.వరదరాజన్ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 16.6 శాతం షెడ్యూల్డ్ కులాల జనాభా ఉన్నారని పేర్కొన్నారు. ప్రసుత బడ్జెట్ లో ఎస్సీలకు రూ.50,548 కోట్లు, ఎస్టీలకు రూ.32,387 కోట్లు కేటాయించారన్న సీపీఎం సభ్యుడు, మొత్తం కేటాయింపులు వాస్తవానికి నాలుగు శాతం తక్కువగా ఉన్నాయని వివరించారు. గతంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఫ్లైఓవర్ నిర్మాణాలకు, కామన్ వెల్త్ గేమ్స్ కు తరలించి దుర్వినియోగపరచారని ఆరోపించారు. కాబట్టి, కేటాయించిన నిధులను దళితుల అవసరాలకే ఖర్చు చేయాలని సూచించారు.