: త్వరలో మచిలీపట్నం పోర్టు పనులు షురూ
మచిలీపట్నం పోర్టు పనులు త్వరలో ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ యూనిట్ తో పాటు బాణసంచా ఫ్యాక్టరీని నెలకొల్పుతామని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో విజయవాడ నుంచే పాలనను కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. రాజధాని ఎక్కడనే విషయం పది రోజుల్లో వెలువడుతుందని చంద్రబాబు చెప్పారు. విజయవాడలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో బాబు ఈ విషయాలను వెల్లడించారు. కార్యకర్తలకు శిక్షణా తరగతులు, వర్క్ షాపులు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.