: ఫీఫా ఫైనల్ కి భారీ భద్రత
ఫిఫా వరల్డ్ కప్ ఫుట్ బాల్ టోర్నీ అంతిమ సమరానికి సిద్ధమవుతోంది. గత కొన్నాళ్లుగా బ్రెజిల్ ను ఊపేసిన ఫుట్ బాల్ ఫీవర్ ఆదివారంతో ముగియనుంది. ఫుట్ బాల్ అంటే పడిచచ్చే బ్రెజిలిన్లు తమ జట్టు సెమీఫైనల్ మ్యాచ్ లో ఓటమిపాలవ్వడంతో ఫుట్ బాల్ పై విరక్తి పెంచుకున్నారు. దీంతో నేడు నెదర్లాండ్స్ తో జరగనున్న మ్యాచ్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బ్రెజిల్ ప్రభుత్వం మాత్రం ఫైనల్ కోసం భారీ భద్రతను చేపట్టనుంది. జర్మనీ బ్రెజిల్ ను ఓడించడంతో బ్రెజిలియన్లు ఆ జట్టుపై ద్వేషంతో రగిలిపోతున్నారు. వారు ఏ క్షణంలోనై ఆటగాళ్లపై దాడికి దిగే ప్రమాదముంది. మరోవైపు ఫిఫా వరల్డ్ కప్ ముగింపు వేడుకలకు కూడా అదే వేదిక కానుండడంతో భద్రత పెంచింది. రియో డీ జెనీరోలోని మరకానా స్టేడియానికి 25 వేల మంది పోలీసులు భద్రతగా నిలవనున్నారు. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 10:50 నిమిషాలకు ముగింపు వేడుకలు ప్రారంభం కానున్నాయి. తెల్లవారు జాము 1:30 నిమిషాలకు జర్మనీ, అర్జెంటీనా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది.