: తెలంగాణ బిల్లుకు సవరణ సరికాదు: జైపాల్ రెడ్డి
తెలంగాణ బిల్లుకు సవరణ చేసే అధికారం కేంద్రంతో పాటు పార్లమెంట్ కు కూడా లేదని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు ప్రక్రియ పూర్తైన వెంటనే ఎలాంటి సవరణలు చేయరాదని ఆయన శనివారం అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 కింద పార్లమెంట్ కు సర్వాధికారాలు ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా బిల్లుకు సవరణలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నంచారు.