: ఫీజు రీయింబర్స్ మెంట్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: రాజయ్య


ఫీజు రీయింబర్స్ మెంట్, మెడికల్ కౌన్సెలింగ్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి రాజయ్య అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే, ఈ విద్యా సంవత్సరంలో ఫీజులను పెంచబోమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 200 మెడికల్ సీట్లు కేంద్రం కేటాయించిందని ఆయన తెలిపారు. నిజామాబాదులోని రిమ్స్ మెడికల్ కాలేజ్ కు 100 సీట్లు కేటాయించామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News