: మోడీ బడ్జెట్ పై పర్యావరణవేత్తల అసంతృప్తి


నరేంద్రమోడీ తొలి ఆర్థిక బడ్జెట్ పై కొంతమంది ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పలువురు పర్యావరణవేత్తలు బడ్జెట్ పై తమ విముఖత తెలిపారు. పర్యావరణపరంగా ఇది నిబద్ధత చూపడంలేదని, మార్పు తేగలిగేటటువంటి బడ్జెట్ కూడా కాదనీ అన్నారు. ఎందుకంటే, పునరుత్పాదక శక్తి లేదా ప్రజా రవాణాకు తగినన్ని నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. ప్రజలు, పర్యావరణం కంటే కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగానే బడ్జెట్ ఉందన్నారు.

  • Loading...

More Telugu News