: ఏపీలో ఇద్దరు టీడీపీ ఎంపీటీసీల అరెస్టు
పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి ఎంపీపీకి జరిగిన ఎన్నికల్లో అధికారులపై దాడులు చేసిన ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. దేవరపల్లి ఎన్నికల్లో వివాదం రేగింది. దాంతో, ఎన్నికలు ఈ నెల 13వ తేదీకి వాయిదా పడ్డాయి. 13న జరుగనున్న ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా వారిద్దరినీ అరెస్టు చేసినట్టు సమాచారం. కాగా, దేవరపల్లి మండల పరిషత్ లో 22 ఎంపీటీసీ స్థానాలు ఉండగా... 12 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థులు, 9 మంది టీడీపీ అభ్యర్థులు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ పోటీ పడుతున్నాయి.