: గాజా మసీదుపై ఇజ్రాయిల్ వైమానిక దాడి, 120కి పెరిగిన మృతుల సంఖ్య


పాలస్తీనాపై ఇజ్రాయిల్ సైన్యం వైమానిక దాడులను కొనసాగిస్తోంది. హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని శనివారం గాజా లోని మసీదుపై దాడి చేసింది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు చనిపోయారు. ఈ దాడిలో చనిపోయిన వారితో కలుపుకుని ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 120కి చేరింది. అదే సమయంలో గాయపడ్డ వారి సంఖ్య 920కి చేరింది. తమ పౌరులపై హమాస్ దాడులకు సమాధానంగా ఇజ్రాయిల్ సైన్యం ఐదు రోజులుగా పాలస్తీనాపై దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో ఎక్కువ మంది సామాన్య పౌరులేనని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు.

  • Loading...

More Telugu News