: వెళ్లాలనుకునేవారు వెంటనే వెళ్లిపోండి: డి.కె.అరుణ
కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లాలనుకునేవారు త్వరగా వెళ్లిపోవాలని మంత్రి డి.కె.అరుణ సలహా ఇచ్చారు. ఎంపీ మందా జగన్నాథం పార్టీని వీడి వెళతారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉందన్నారు. వెళ్లాలనుకునేవారు వెంటనే వెళ్లాలని పార్టీలోనే ఉంటూ నష్టం కలిగించవద్దని ఆమె సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికే పాలమూరు జిల్లాలో బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు.