: మూడేళ్ల కొడుకును తల నరికి చంపిన తల్లి
'అమ్మా, దుకాణానికి వెళతా'నన్న ఆ మూడేళ్ల చిన్నారి కొడుకును 'వద్దు బాబూ' అంటూ ఆపేసింది తల్లి. అంతలోనే, ఏమైందో తెలియదు కానీ, కన్న కొడుకును ఆ తల్లి తల నరికి మరీ చంపేసింది. రాజస్థాన్ లోని ఆజ్మీర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన అక్కడ కలకలం రేపింది. మూడేళ్ల కొడుకును తల నరికి చంపేసిందని ఆజ్మీర్ కు చెందిన అంతిమా జైన్ ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొడుకును హతమార్చిన ఆ తల్లి తొలుత తనకేమీ తెలయదని బుకాయించినప్పటికీ, తర్వాత నేరాన్ని అంగీకరించింది. అయితే కన్న కొడుకును ఎందుకు హతమార్చావన్న ప్రశ్నకు అంతిమా నోరువిప్పడం లేదట.