: 'బిగ్ బాస్' తాజా సీజన్ కు షారుక్ ఖానే గొప్ప హోస్ట్!: సల్మాన్ ఖాన్


ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' 8వ సీజన్ కు ఈసారి సల్మాన్ ఖానే హోస్టుగా వ్యవహరిస్తున్నాడా? అంటే, ప్రస్తుతానికేదీ ఖరారు కాలేదు. అయితే, ఈ మేరకు సల్మాన్ మాట్లాడుతూ, ఈ సారి సీజన్ కు తాను హోస్టుగా వ్యవహరించకుంటే, అందుకు షారుక్ ఖానే తగినవాడని, అతను ఆ షోకి గొప్ప హోస్ట్ అవుతాడని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. "నేను ఈసారి హోస్టుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు" అని సల్మాన్ అన్నాడు. ఇప్పటివరకు బిగ్ బాస్ షో నాలుగు సీజన్లకు సల్లూ హోస్టుగా చేశాడు. అయితే, గతేడాది షో సమయంలో కొంతమంది కంటెస్టెంటుల విషయంలో సల్మాన్ పక్షపాతం వహించాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాల కారణంగా తాజా సీజన్ కు కండలవీరుడు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News