: లేటుగా వచ్చారని ఎమ్మెల్యేలకు ఫైన్


బడ్జెట్ సమావేశాలకు ఆలస్యంగా వచ్చిన తన పార్టీ ఎమ్మెల్యేలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా వారికి జరిమానా విధించారు. త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండగా, చర్చించడానికి సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే, అధికార బీజేపీ సభ్యులు 15 మంది ఆలస్యంగా వేంచేశారు. దీంతో, ఒక్కొక్కరికి రూ.500 జరిమానాగా విధించింది సర్కారు. కాగా, జరిమానా కట్టిన లాడ్ పురా ఎమ్మెల్యే భవానీ సింగ్ రాజావత్ మాట్లాడుతూ, ఈ శిక్ష సరైనదేనని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఆలస్యంగా వచ్చేవారికి సమయం విలువ తెలుస్తుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News