: మృగాడికి పదేళ్ల జైలు
పొరుగింటి మహిళపై అత్యాచారం చేయడమే కాక ఎవరికైనా చెబితే హతమారుస్తానంటూ భయపెట్టిన ఓ మృగాడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ముజఫర్ నగర్ కోర్టు న్యాయమూర్తి హరీశ్ త్రిపాఠి శనివారం తీర్పు చెప్పారు. 2011 అక్టోబర్ 8న ముజఫర్ నగర్ జిల్లా సీసోలి పట్టణంలో అఖిలేశ్ అనే దుండగుడు తన పొరుగింటిలో నివాసముంటున్న మహిళపై ఆమె ఇంటిలోనే అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ 376, 506 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. నిందితుడిపై మోపిన అభియోగాలు నిజమేనని ప్రాసిక్యూషన్ నిరూపించింది. దీంతో నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 30 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.