: వీరికి పెళ్ళిళ్ళు చేసి పుణ్యం కట్టుకోండి బాబూ!: చంద్రబాబుకు అశోక్ బాబు వినతి


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ పరిపక్వత గలిగిన నేత అని... రాష్ట్ర అభివృద్ధికి ఆయన కంకణం కట్టుకున్నారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కొనియాడారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా మారాయని... వారికి పెళ్లి కూడా కావడం లేదని... ఐదేళ్ల పరిపాలనా కాలంలో దశలవారీగా వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని ఈ సందర్భంగా అశోక్ బాబు కోరారు. రాజకీయ కుట్రతోనే రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో చంద్రబాబు సన్మానసభలో మాట్లాడుతూ అశోక్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News