: సంతలో కూరగాయల్లా శిశువులను అమ్ముతున్నారు: ఢిల్లీ కోర్టు
దేశంలో శిశు విక్రయం తీవ్రస్థాయిలో జరుగుతోందని ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దత్తత పేరిట పసికందులను సంతలో కూరగాయల్లా విక్రయిస్తున్నారని మండిపడింది. ఈ విషయమై అదనపు సెషన్స్ జడ్జి కామిని లావు మాట్లాడుతూ, "చిన్నారులను టమోటాలు, బంగాళాదుంపలు, ఉల్లిగడ్డల్లా అమ్ముతున్నారు. చాలా రాష్ట్రాల్లో శిశు విక్రయాలకు సంబంధించి భారీ రాకెట్ నడుస్తోంది" అని వ్యాఖ్యానించారు. ఓ కేసు విచారణ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా దేశాల్లో దీనిపై నిషేధం ఉందని తెలిపారు.