: సీఎం వద్దే డబ్బుల్లేవ్... మనమెలా అడిగేది?: విజయవాడ మేయర్
"సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దే డబ్బుల్లేవ్, ఇక మనకెలా ఇస్తారు? అసలు పరిస్థితి తెలిసి మనమెలా అడిగేది? రాష్ట్ర ఖజానా నిండు కుండ అయితే ఏమైనా, ఎంతైనా నిధులు అడగొచ్చు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు కదా!" అంటున్నారు విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్. నగర పాలక సంస్థలోని అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను సక్రమంగా అమలు చేస్తే నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్దకెళ్లాల్సిన అవసరం ఎంతమాత్రం రాదని ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం నగర పాలక సంస్థ రూ. 350 కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయిందన్న మేయర్, పరిస్థితిని నేడు నగర పర్యటనకొచ్చే సీఎం చంద్రబాబుకు వివరిస్తానన్నారు.