: విజయవాడ కనకదుర్గమ్మకు ఏపీ మంత్రి విరాళం
ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు ఈ సందర్భంగా అమ్మవారి ఆలయానికి రూ.లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలపై మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమ నిధిని కోటి రూపాయలకు పెంచుతామని తెలిపారు.