: 'షారూఖ్ ఖాన్ సెక్సీయెస్ట్ పర్సన్' అంటున్న బ్యాడ్మింటన్ క్వీన్


ఇటీవలే ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ నెగ్గి మాంచి ఊపుమీదున్న భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఏమంటుందో వినండి. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సెక్సీయెస్ట్ పర్సన్ అని స్టేట్ మెంట్ ఇస్తోంది. పైగా షారూఖ్ వెరీ స్మార్ట్ అట. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించింది. ఇక, మహేశ్ భట్ తన జీవితకథను సినిమాగా మలుస్తున్నట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ, దాని గురించి పెద్దగా వివరాలేమీ తెలియవని పేర్కొంది. కాగా, ఇటీవలే ఓ లైఫ్ స్టైల్ మ్యాగజీన్ సైనాను 'సెక్సీయెస్ట్ ఉమన్ ఆఫ్ ఇండియా' జాబితాలో చేర్చడం విశేషం.

  • Loading...

More Telugu News