: మెస్సీ కోసం వ్యూహాలకు పదునుపెడుతున్న జర్మన్లు
ఫిఫా వరల్డ్ కప్ చరమాంకానికి చేరుకుంది. రేపటి ఫైనల్లో అర్జెంటీనా, జర్మనీ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు వ్యూహ ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ముఖ్యంగా, అర్జెంటీనా స్టార్ ఫార్వర్డ్ లయొనెల్ మెస్సీని కట్టడి చేస్తే పని సులువు అవుతుందని జర్మన్లు భావిస్తున్నారు. అందుకే మెస్సీ కోసం ఓ 'స్పెషల్ ప్లాన్' సిద్ధం చేశామని జర్మనీ జట్టు అసిస్టెంట్ కోచ్ హాన్సి ఫ్లిక్ తెలిపాడు. సెమీస్ లో మెస్సీని డచ్ జట్టు సమర్థంగా నిలువరించడం తాము గమనించామని, అదే రీతిలో తాము కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామని ఫ్లిక్ వెల్లడించాడు.