: గుంటూరులోనే ఎయిమ్స్ ఏర్పాటు చేయాలట: కేంద్రం
ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన ఎయిమ్స్ ను గుంటూరులో ఏర్పాటు చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ మేరకు తమకు కేటాయించిన ఎయిమ్స్ ను గుంటూరులో ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం లోక్ సభలో చెప్పారు. ఎయిమ్స్ ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని రాష్ట్ర సర్కారు గుంటూరులోనే ప్రతిపాదించినట్లు మంత్రి చెప్పారు. ఇదిలా ఉంటే ఎయిమ్స్ తరహా వైద్యాలయాలను రాష్ట్రానికొకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న మంత్రి, స్థల కేటాయింపుల్లోనే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయన్నారు. ఒక చోట ఎయిమ్స్ తరహా వైద్యాలయాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 200 ఎకరాల స్థలం అవసరమవుతుందని ఆయన పేర్కొన్నారు.