: సువారెజ్ ను రూ. 770 కోట్లకు కొన్న బార్సిలోనా క్లబ్!
ఉరుగ్వే స్టార్ స్ట్రయికర్ సువారెజ్ కోసం ప్రఖ్యాత ఫుట్ బాల్ క్లబ్ బార్సిలోనా ఏకంగా రూ. 770 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. సువారెజ్ ప్రస్తుతం లివర్ పూల్ క్లబ్ సభ్యుడిగా ఉన్నాడు. అతన్ని సొంతం చేసుకునేందుకు ఇంత భారీ మొత్తంలో బార్సిలోనా క్లబ్ డీల్ కుదుర్చుకున్నట్టు బీబీసీ న్యూస్ తెలిపింది. సువారెజ్ ను తమ జట్టులోకి తీసుకుంటున్నట్టు బార్సిలోనా కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే డీల్ విలువను మాత్రం వెల్లడించలేదు. ఒకవేళ రూ. 770 కోట్ల డీల్ నిజమైతే గనుక ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో ఇప్పటి దాకా జరిగిన అత్యంత విలువైన బదిలీ ఫీజుల్లో ఇది మూడోది అవుతుంది. ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో ఇటలీ ఆటగాడు జార్జియో చిలీ భుజాన్ని కొరికిన సువారెజ్ నాలుగు నెలల నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.