: బార్ ఏర్పాటుపై భగ్గుమన్న బెజవాడ మహిళలు
నివాసాల మధ్య బార్ ఏర్పాటు చేయడంపై బెజవాడ మహిళలు మండిపడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా విద్యాధరపురంలో బార్ ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తుండడాన్ని గమనించిన స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. నివాసాల మధ్యలో మద్యం దుకాణాన్ని ఎలా తెరుస్తారంటూ అధికారులను నిలదీశారు. దీనిపై ఆరా తీస్తే అసలు బార్ ఏర్పాటుకు లైసెన్స్ లేదని తేలింది. నిర్వాహకులు హోటల్ నడుపుకుంటామంటూ దరఖాస్తు చేసుకుని, ఏకంగా బార్ పెట్టేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. దీంతో అధికారులు బార్ ఏర్పాటును అడ్డుకున్నారు. గుంటూరులోనూ బార్ ఏర్పాటు చేయవద్దంటూ స్థానికులు రోడ్డెక్కారు. రిలే నిరాహారదీక్షలను చేస్తున్నారు.