: రైతు రుణాల లిస్టు ఇవ్వాలని బ్యాంకులను కోరిన ఏపీ
రైతు రుణాల జాబితాను అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది. రైతు రుణాల రీషెడ్యూల్ కు ఆర్బీఐ అంగీకరించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశాలు పంపింది. రుణాల రీ షెడ్యూల్ పై కోటయ్య కమిటీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చించింది. కాగా, రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్న టీడీపీ నిర్ణయం ఏమైందంటూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ దుయ్యబడుతోంది. రుణమాఫీయా? లేక రుణాల రీషెడ్యూలా? అనేది తక్షణం టీడీపీ ప్రజలకు స్పష్టం చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది.