: మరకానా స్టేడియం చుట్టూ అర్జెంటీనా ఫ్యాన్స్ కోట కట్టేశారు


బ్రెజిల్ లో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ జరిగే మరకానా స్టేడియం చుట్టూ అర్జెంటీనా ఫ్యాన్స్ తిష్ట వేశారు. భారత కాలమానం ప్రకాం ఆదివారం తెల్లవారు జామున 1:30 నిమిషాలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం అర్జెంటీనా అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ ప్రత్యక్షంగా తిలకించేందుకు వేలాదిమంది అభిమానులు స్టేడియం బయటే టెంట్లు వేసుకుని ఉంటున్నారు. దీంతో బ్రెజిల్ మీడియా, అర్జెంటీనా అభిమానులు స్టేడియం బయట కోట కట్టేశారని వార్తలు ప్రచురిస్తోంది. కాగా, బ్రెజిల్ ఫుట్ బాల్ అభిమానులు అర్జెంటీనా ఆటగాడు మెస్సీని అభిమానిస్తారు. కాగా, ఫైనల్ మ్యాచ్ టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయి.

  • Loading...

More Telugu News