: డివిల్లీర్స్, కోహ్లీ మెరుపు బ్యాటింగ్
చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ క్రిస్ గేల్ అవుటవ్వగానే అందరూ నిరాశపడ్డా.. కాసేపటికే ఆ నిరుత్సాహం కాస్తా పెను ఉత్సాహంగా పరిణమించింది. ఏబీ డివిల్లీర్స్, విరాట్ కోహ్లీ.. గేల్ అవుటైన లోటును తెలియనివ్వకుండా ఇన్నింగ్స్ ను మెరుపు వేగంతో నడిపించారు. కోహ్లీ 47 బంతుల్లో 58 పరుగులు చేయగా.. డివిల్లీర్స్ 32 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లో మోరిస్ 3 వికెట్లు తీశాడు.