: ఆధార్ కార్డులు జారీ చేసిన తరువాత రేషన్ తో జత చేస్తాం: సునీత


ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో ఆధార్ కార్డులు జారీ చేసిన తరువాత వాటిని రేషన్ కార్డులకు జత చేస్తామని పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, రేషన్ డీలర్లు ఎవరు అక్రమాలకు పాల్పడినట్టు రుజువైనా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ధరల నియంత్రణకు చర్యలు చేపడతామని, వంద రోజుల్లో లక్ష దీపం కనెక్షన్లు ఇస్తామని ఆమె వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఉల్లిపాయ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News