: లోక్ సభలో బలముందని పోలవరం బిల్లు ఆమోదించుకున్నారు: కోదండరాం
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టసవరణ బిల్లు లోక్ సభ ఆమోదం పొందడాన్ని టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ముంపు పేరుతో ఒక రాష్ట్రంలోని ప్రాంతాలను మరో రాష్ట్రంలో కలపడం చట్ట వ్యతిరేకమన్నారు. సభలో బలముందని బిల్లు ఆమోదింపజేసుకోవడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం అనవసరంగా తలదూరుస్తోందని కోదండరాం విమర్శించారు.