: బీసీసీఐపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన గవాస్కర్
బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి సుప్రీంకోర్టు ఎన్.శ్రీనివాసన్ ను తప్పించిన తర్వాత సునీల్ గవాస్కర్ తాత్కాలిక అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన నియామకం కేవలం ఐపీఎల్-7 సీజన్ వరకే పరిమితం చేశారు. అనంతరం, బోర్డు ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్ బీసీసీఐ మధ్యంతర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఇదిలావుంటే... తాను బీసీసీఐకి అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలానికి సంబంధించిన పారితోషికం ఇంకా చెల్లించలేదంటూ గవాస్కర్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తన ఫీజు చెల్లించేలా క్రికెట్ బోర్డును ఆదేశించాలంటూ న్యాయస్థానానికి ఓ లేఖ రాశాడు. ఈ ఫిర్యాదుపై నేడు విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదావేసింది.