: బెంగళూరు పేలుళ్ల నిందితుడు, పీడీపీ ఛైర్మన్ మదానీకి బెయిల్
కేరళ పీడీపీ ఛైర్మన్, బెంగళూరు పేలుళ్ల నిందితుడు అబ్దుల్ నాసర్ మదానీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మధుమేహంతో బాధపడుతున్న అతను చికిత్స చేయించుకునేందుకు కోర్టు ఈ బెయిల్ ఇచ్చింది. 2010లో జరిగిన బెంగళూరు పేలుళ్ల ఘటనలో ఒకరు మరణించగా, ఇరవైమంది వరకు గాయపడ్డారు. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న మదానీని అప్పుడే అరెస్టు చేయడంతో ప్రస్తుతం జైల్లో ఉంటున్నారు. అయితే, ఆయనకు బెయిల్ ఇవ్వడాన్ని కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. కస్టడీలోనే మదానీకి చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.