: రాష్ట్రపతిని కలిసి ముంపు మండలాలను ఏపీలో కలపకుండా అడ్డుకుంటాం: పోచారం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపకుండా అడ్డకుంటామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్రం ఏకపక్షంగా పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపిందని మండిపడ్డారు. రాష్ట్రపతి అడ్డుకోని పక్షంలో న్యాయపోరాటానికి వెనుకాడబోమని పోచారం స్పష్టం చేశారు.