: వారంలోగా అన్ని శాఖల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు: ఏపీ సీఎస్
మరో వారంలోగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన అన్ని శాఖల్లో పూర్తిస్థాయి పాలన ప్రారంభమవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొన్ని శాఖల్లో కంప్యూటర్ నెట్వర్క్ సమస్య ఉందనీ... ఇంధనశాఖ, మరికొన్ని శాఖలకు స్థల సమస్య ఉందని చెప్పారు. ఈ నెల 14న ఆలిండియా సర్వీసెస్ విభజనపై ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ అవుతుందని తెలిపారు. ఇక ఐఏఎస్ అధికారుల కేటాయింపు ప్రక్రియకు మరో నెల పడుతుందన్నారు. అటు, సచివాలయంలో అన్ని సమస్యలను అధిగమిస్తామని స్పష్టం చేశారు.